
జన సముద్రం న్యూస్ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఫిబ్రవరి 24:
ప్రతినిధి తుపాకుల రమేష్:
గురువారం తేది 23.02.2023 నాడు దమ్మాయిగూడ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో స్కూల్ పిల్లలతో వస్తున్న బస్సు డ్రైవర్ ని చెక్ చేయగా అతను తాగి బస్సు నడుపుతున్నట్టుగా నిర్ధారణ కావడం తో అతనిని మరియు మరో 17 మంది ని ఈరోజు మల్కాజ్గిరి కోర్ట్ నందు ప్రవేశ పెట్టగా మేజిస్ట్రేట్ గారు 10 రోజుల జైలు శిక్ష మరియు 3000 రూపాయలు జరిమానా విధించడం జరిగినది, మరో 17 మందికి ఒక్కొక్కరికి 2500 రూపాయలు జరిమానా విధించడం జరిగినది.
జైలు శిక్ష విధించబడిన వ్యక్తి యొక్క వివరములు
మామిడాల బిక్షపతి s/o బాల మల్లయ్య, వయస్సు: 35 , వృత్తి : బస్ డ్రైవర్, నివాసం : ఈసీఐఎల్, కుషాయిగూడ
కావున మద్యం తాగి వాహనాలు నడపవద్దని, అదే విధంగా స్కూల్ పిల్లలని తీసుకెళ్ళే బస్సు డ్రైవర్ లను సరిగా వున్నారా లేదా చూసుకోవాలని, ప్రమాదలకి గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని
శ్రీనివాస్ రావు ఏ.సి.పి మల్కాజ్గిరి ట్రాఫిక్ గారు తెలియజేయడమైనది. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో సుధీర్ కృష్ణ ఇన్స్పెక్టర్ ( సిఐ), నాగరాజు రెడ్డి అడ్మిన్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.





