విద్యా ప్రమాణాల అభివృద్ధిలో ఎస్ ఎం సి సహకారం అభినందనీయం: ప్రధానోపాధ్యాయులు.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, ఫిబ్రవరి 25.

పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం జడ్పీ హెచ్ ఎస్, యుపిఎస్ పోతిరెడ్డిపల్లి ప్రధానోపాధ్యాయులు మువ్వ వెంకటేశ్వరరావు, భూక్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ సెలక్ట్ చేసిన పిటిఎం పాఠశాలల్లో భాగంగా పినపాక మండలం నుండి రెండు పాఠశాలలు ఎన్నికవ్వటం గర్వకారణం అని తెలియజేశారు.10వ తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఉపాధ్యాయులకు 6 మంది విద్యార్థులను దత్తత ఇచ్చామని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సరైన వాతావరణం కల్పించి సహకరించాలని, విద్యా ప్రమాణాలను గురించి సన్నద్ధం చేసే దానిలో భాగస్వాములు కావాలని, ప్రతి విద్యార్థి కూడా వేకువ జామున లేపి చదివించాలని,విద్యార్థుల ఆరోగ్యo పట్ల శ్రద్ధ చూపించాలని, విద్యార్థులకు చదువు పట్ల ఎటువంటి సందేహాలు ఉన్న సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఏ సమయంలోనైనా ఫోను ద్వారా సందేహాలను నివృతి చేసుకోవచ్చని రాబోయే రెండు నెలలు విద్యార్థులకు చాలా ముఖ్యమని, ఏ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు గైర్హాజరు కాకుండా సహకరించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు.వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు చేయవలసిన సలహాలు, సూచనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎంసి చైర్మన్ వాగబోయిన వెంకటరమణ, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి