
-ర్యాకల కృష్ణ గౌడ్
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :23
మనోహరాబాద్ ఎల్లమ్మ తల్లి ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ర్యాకల కృష్ణగౌడ్ తెలిపారు.ముఖ్యంగా పూర్తి సహాయ సహకారం అందించిన కొంపల్లి బైరి శ్రీవిద్య ప్రశాంత్ గౌడ్,మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్ రావు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మండల కేంద్రం మనోహరాబాద్ లోగల అవని గార్డెన్ లో మాజీ ఎంపీటీసీ,జిల్లా ఆస్ర అధ్యక్షులు ర్యాకల కృష్ణ గౌడ్ నిర్మింప చేసిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఈ నెల 20,21వ తేదీ లో నిర్వహించిన ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహహించిన పూజా కార్యక్రమంలో,కళ్యాణ వేడుకలో తమ ఆహ్వానాన్ని గౌరవించి హాజరై పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్,నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి,పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పీసీసీ సభ్యులు భూపతి రెడ్డి,వేణుగోపాల్ యాదవ్,తాడూరి శ్రీనివాస్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు తరుణ్ గౌడ్,కొంపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్, కొంపల్లి కౌన్సిలర్ శివకుమార్ గౌడ్,గ్రంధాలయ, చైర్మెన్ చంద్రగౌడ్,తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, జడ్పీటీసీ మహేష్ గుప్త, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సంతోష్ గుప్త మరియు మండలంలోని ప్రజాప్రతినిధులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.





