
పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్,మక్తల్ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్ గంగాధర్
జనసముద్రం న్యూస్, గచ్చిబౌలి (ఫిబ్రవరి 23)
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి తండా మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ ప్రీవైస్ హాస్పిటల్ ‘ను గురువారం ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ , మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ,నార్సింగ్ మునిసిపల్ చైర్మన్ రేఖ యాదగిరి తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా అధునాతన హంగులతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కాలనీ వాసులు,స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు





