
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 23.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం లోని గడ్డంపల్లి గ్రామపంచాయతీ నందు నిర్వహించినటువంటి కంటి వెలుగు కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి పరీక్షల శిబిరాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన పినపాక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గాభవాని ,ఇ.ఎన్.టి డాక్టర్ దినేష్ ,డాక్టర్ అశోక్ కుమార్ ,డివో జ్యోతి లకు కృతజ్ఞతలు తెలిపారు. పినపాక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గాభవాని మాట్లాడుతూ కంటి చూపు మందగించినటువంటి వ్యక్తులకు కళ్ళజోళ్ళు ఉచిత పంపిణీ , శుక్లాలు సమస్య ఉంటే వారిని ఆపరేషన్ కు రిఫర్ చేస్తున్నామని, అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే మందుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ హజార్ MD ,పంచాయతీ సర్పంచ్ కలివేటి సునీల్ ,వార్డ్ నెంబర్ ఎడ్ల సారమ్మ, కలివేటి సుమన్, గ్రామ అధ్యక్షుడు పడిగా అశోక్ కుమార్, పినపాక ప్రాథమిక వైద్య సిబ్బంది ,ఏఎన్ఎం లు మరియు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





