మెదక్ జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

Spread the love
  • వచ్చే వర్షాకాలం తొమ్మిదో విడత హరితహారం కు నర్సరీలో మొక్కలు సిద్ధంగా ఉంచాలి…

*మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా……

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :22

మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్కులో నిర్మిస్తున్న కాటేజీ నిర్మాణాలను మార్చి నాటికి పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అటవీ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. బుధవారం 252 హెక్టార్లలో ఏర్పాటు చేసిన నరసాపూర్ అర్బన్ పార్క్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్ తో కలిసి వాచ్ టవర్ ఎక్కి అడవి అందాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ కు సమీపంలో ఉన్న ఇట్టి పార్క్ కు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆహ్లాదవాతావరణం కల్పిస్తూ సౌకర్యాలు కల్పిస్తే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. పార్కులో కోటిన్నర రూపాయల వ్యయంతో నిర్మిస్తూ ముగింపు దశలో ఉన్న 7 కాటేజీలు, డైనింగ్ హాల్స్, కిచెన్ షెడ్, రిసిప్షన్ కౌంటర్ వంటి పనులను పరిశీలించి కూలీలను అధిక సంఖ్యలో పెట్టి నాణ్యతలో రాజీపడకుండా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. కాటేజీల సమీపం నుండి బోటులో షికారు చేసేలా బోటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చక్కటి పచ్చిక బయళ్లు (లాన్ ) ఫౌంటెన్, యోగా, మెడిటేషన్, స్విమ్మింగ్ వంటి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని డి ఎఫ్ ఓ కు సూచించారు. సైక్లింగ్ ట్రాక్ ను పరిశీలించి ట్రెక్కింగ్ సైకిళ్ళు కొనుగోలు చేయాలని, పార్కులో అక్కడక్కడా గ్యాప్ ఉన్న దగ్గర పెద్ద మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క జీవించేలా చూడాలని, చనిపోయిన వాటి స్థానంలో తిరిగి మొక్కలు నాటాలని సూచించారు. వచ్చే వర్షాకాలం 9వ విడత హరిత హారం కు నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉంచాలన్నారు.
అనంతరం 90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రంధాలయ భవనాన్ని సందర్శించి మిగిలిపోయిన ఫ్లోరింగ్, కలరింగ్, ఎలక్ట్రిసిటీ వంటి పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్త చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని, అందుకు అవసరమైన 10 లక్షల నిధులను గ్రంధాలయ సెస్ నుండి అందించవలసినదిగా మునిసిపల్ కమీషనర్ కు సూచించారు. 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించి మెటీరియల్ ను సిద్ధంగా ఉంచుకొని, అధిక సంఖ్యలో లేబర్ ను పెట్టి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.


ఆ తరువాత శాసనసభ్యులు మదన్ రెడ్డి తో కలిసి ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతి రోజు 500 మందికి పైగా అవుట్ పేషంట్లను పరీక్షిస్తుండడం, ప్రసూతి వార్డులో ఉన్న 20 బెడ్స్ ఎప్పుడు ఫుల్ గా ఉండడం, నెలకు 120 కు పైగా కాన్పులు చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని, బిడ్డ పుట్టిన వెంటనే కె.సి.ఆర్. కిట్ అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగిని ఆరోగ్యంగా ఇంటికి పంపుటలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. స్కానింగ్, అంబులెన్స్ వంటి సమస్యలను అధిగమించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మీర్జా బేగ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ లకు సూచించారు.
అనంతరం మెదక్ రోడ్ నర్సాపూర్ శివారులో తాత్కాలికంగా చెత్తను డంప్ చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి అట్టి చెత్తను బయో మైనింగ్ చేసి తొలగించాలని, ఇక నుండి వెల్దుర్తి రోడ్ లో డంపింగ్ యార్డ్ కు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో చెత్తను వేయాలని కలెక్టర్ మునిసిపల్ కమీషనర్ కు సూచించారు.
మంబోజిపల్లి లో అవెన్యూ ప్లాంటేషన్ ను తిలకించి మల్టీ లెవెల్ ప్లాంటేషన్ చేయాలని, టేకోమా వంటి చెట్లు నాటాలని, ట్రీ గార్డులను చక్కగా ఏర్పాటు చేసి మొక్కలు చనిపోకుండా నీరందించాలని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, వైస్ చైర్మన్ జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ అధికారి అంబర్ సింగ్, మునిసిపల్ కమీషనర్ వెంకట గోపాల్, పంచాయత్ రాజ్ ఈ ఈ సత్యనారాయణ రెడ్డి, ఏం పి డి ఓ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్