
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 22 :
దామరచర్ల మండల కేంద్రంలో దళిత నాయకుల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఎందువలన అంటే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పోలీసు లాంచనాలతో నిర్వహించకపోవడం చాలా బాధాకరమని,ఈ సంఘటనకు దళిత నాయకులు ఆగ్రహానికి గురై తమ ఆవేదనను వ్యక్తపరిచారు.
మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్లపల్లి విజయ్ మాట్లాడుతూ..
సాయన్న అంత్యక్రియలు ఈనాటి బి ఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ లాంఛనాలతో నిర్వహించకపోవటానికి తీవ్రంగా ఖండించారు. దళితులపై చిన్న చూపు చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దళితులమంత ఏకమై బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడిస్తామని హెచ్చరించారు.
ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు చందాల సదానాదం మాట్లాడుతూ..
సాయన్న అంత్యక్రియలు ప్రభుత్వం లాంచనాలతో నిర్వహించకపోవడం దళితులను అవమానించినట్టే నని తెలిపారు. వివాద రహితునిగా పేరున్న సాయన్న కు ఇలా చేయటం బి ఆర్ ఎస్ పార్టీ దళితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు శివశరణ్ నాయక్, ఎస్సీ సెల్ నాయకులు తాళ్లపల్లి దావీదు పాల్గొన్నారు.





