
- ఎమ్మెల్యే దంపతుల పేర అమ్మవారికి పూజలుచేసి కేకును కట్ చేసిన చైర్మన్ బాలాగౌడ్…
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 22
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వివాహా వార్షికోత్సవ వేడుకలు ఏడుపాయలలో ఆలయ పాలకమండలి చైర్మన్ సాతేల్లి బాలాగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.బుధవారం ఉదయం వనదుర్గాదేవి ఆలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేరు మీద అర్చక బృందం ప్రత్యేకంగా విశేషపూజలు,అర్చన తదితర కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో చైర్మన్ ఎస్ బాలాగౌడ్ కేకును కట్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు,ఎక్స్ అఫిషియో డైరెక్టర్ ఆర్ శంకర్ శర్మ, ధర్మకర్తలు మనోహర్,మారుమాల నాగభూషణం,బాగారెడ్డి,యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు.





