కోనయిపల్లి లో కంటి వెలుగు ప్రారంభించిన : సర్పంచ్ కంకణాల పాoడు

Spread the love

కంటి వెలుగు దేశానికే ఆదర్శం: ఆంజనేయులు గౌడ్

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 22

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తూప్రాన్ మండలం కోనాయిపల్లి పిబి గ్రామంలో గ్రామ సర్పంచ్ కంకణాల పాండు , బీ ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్ తో కలిసి బుదవారం రోజున ప్రారంభించారు. గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి కంటి అద్దాలను, మందులను వైద్యులు పంపిణీ చేశారు. కంటి చూపు పూర్తిగా మందగించిన వారికి శస్త్ర చికిత్స చేసుకోవాలని సూచించారు.. ప్రభుత్వమే ఉచితంగా రెండు మూడు నెలల వ్యవధిలో కంటి శస్త్ర చికిత్సలు చేయిస్తుందని వైద్యులు తెలిపారు.. పేద ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కంకణాల పాండు, బీ ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పంజాల ఆంజనేయులు గౌడ్ లు పిలుపునిచ్చారు. సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పరి రమ్య శంకర్, వైద్య అధికారి స్రవంతి, వైద్య సిబ్బంది కళ్యాణి, సంధ్య, దుర్గా రెడ్డి, సురేష్, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ, వార్డు సభ్యులు, ఏఎన్ఎం వెంకటలక్ష్మి, శ్యామల, ఉప సర్పంచ్ రమ్య శంకర్, వార్డు సభ్యులు , వివో ఏ స్వరూప, అంగన్వాడి టీచర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి