క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన-నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్

Spread the love

రాబోయే రోజుల్లో యువతను ప్రోత్సహిస్తాం-బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 22)

శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్ తృతీయ పుత్రుడు, రవికుమార్ యాదవ్ సోదరుడు రాజ్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్ధం ఆర్.కే.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి లీగల గ్రౌండ్, బి. హెచ్.ఈ.ఎల్ గ్రౌండ్ లలో నిర్వహిస్తున్న టి 20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఇరుజట్లకు శుభాకాంక్షలు తెలియజేసి, టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు, పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందలు తెలియజేశారు, నియోజకవర్గం లో యువకులు అందరూ ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలన్నారు, ఆటల వల్ల శారీరక , మానసికోల్లాసంతో పాటు ప్రతి పనిలో ఏకాగ్రత లభిస్తుందన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రారంభించాడనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు , ఈ టోర్నమెంట్ నిర్వహణకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు, నా సోదరుడు రాజ్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్ధం ..ఆర్.కే .వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ను నియోజకవర్గంలో ఉన్న యువతలో ఉన్న ప్రతిభను వెలికతీసేందుకు గతంలో కూడా నిర్వహించామని కొంతకాలం కరోనా వల్ల నిర్వహించలేకపోయామని ఇప్పుడు మరల మొదలు పెట్టడం ఆనందంగా ఉందన్నారు , ఆటలు ఆడటం వల్ల మనలో ఉన్న ఒత్తిడి తగ్గటంతో పాటు మనం ఆటలో ఎలా గెలవటానికి ఎంత ఏకాగ్రతతో ప్రయత్నిస్తామో అలానే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఏకాగ్రత ఎలా చేయాలో నేర్చుకుంటామని రాబోయే రోజుల్లో టోర్నమెంట్ ను అన్ని డివిజన్లలో నిర్వహించి నియోజకవర్గంలో ప్రతి యువకుడి కి చేరుకునేలా ఈ టోర్నమెంట్ ను తీసుకుని వెళ్తామన్నారు, ఇక్కడ ఆడటానికి వచ్చిన ప్రతి క్రీడాకారునికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి పటేల్, రాఘవేంద్ర రావు, రాధాకృష్ణ యాదవ్, ఏళ్లేశ్, అనికుమార్ యాదవ్ ,రమేష్, హనుమంత్ నాయక్, సోమయ్య యాదవ్, చంద్రమౌళి, అరుణ్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్ , శ్రీను.జే, రాము.జే, కౌశిక్ ,కృష్ణ బాలయ్య, దేవేందర్ ,జగదీష్ ,కిట్టు, సహదేవ్ ,పవన్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి