
జనసముద్రం న్యూస్, సైబరాబాద్, (ఫిబ్రవరి 20)
రాష్ట్రంలోనే ఉత్తమ పోలీసుస్టేషన్‌గా దుండిగల్ పోలీసుస్టేషన్ ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోం శాఖ ఏటా కొన్ని పరిమితులు ఆధారంగా దేశంలో ఉత్తమ పోలీసుస్టేషన్లను ఎంపిక చేస్తుంది అందులో భాగంగా దుండిగల్ పోలీసుస్టేషన్ 2022 సంవత్సరానికి రాష్ట్రంలోనే నంబర్ 1స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి, కేంద్ర హోం శాఖ సెక్రటరీ సంతకంతో కూడిన సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీని జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ కేంద్ర హోమ్ శాఖ అందించిన సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇతర పోలీస్ స్టేషన్ లకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని అయన అన్నారు ఉత్తమ ప్రతిభ కనబర్చి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించిన దుండిగల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లను దుండిగల్ ఇన్స్పెక్టర్ రమణా రెడ్డి, మేడ్చల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, డీసీపీ సందీప్ లను సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు కానిస్టేబుళ్ల సహకారం లేకుండా ఈ అవార్డు సాధ్యం కాదు అని సీపీ అన్నారు





