
మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :20
ఏడుపాయల శ్రీ వన దుర్గాదేవి అమ్మవారిని సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ చైర్మన్ సాతేల్లి బాలాగౌడ్, ఈఓ సార శ్రీనివాస్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో జిల్లా కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. అలయ గర్భాలయంలో వన దుర్గాదేవి అమ్మవారికి కలెక్టర్ రాజర్షిషా కుంకుమార్చన, వివిధ విశేష పూజలు ను చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారి అనుగ్రహాన్ని, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.ఆలయ చైర్మన్ సాతేల్లి బాలాగౌడ్, ఈఓ సార శ్రీనివాస్ లు ఆలయ మర్యాదలతో కలెక్టర్ రాజర్షిషా కు శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు.అనంతరం కలెక్టర్ జాతర ప్రాంగణం అంతా కాలినడకతో తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.కలెక్టర్ వెంట ఆర్డీవో సాయిరాం,జెడ్పి సీఈవో శైలేశ్,మిషన్ భగీరథ ఇంజనీర్ కమలాకర్,ఫిషరీస్ ఏడి రజని,ఆలయ పాలకమండలి చైర్మన్ ఎస్ బాలాగౌడ్,ఆలయ ఈఓ శ్రీనివాస్ ,తదితర శాఖ ల జిల్లా అధికారులు పాల్గొన్నారు.






