
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 19:
భూక్య మం గులాల్ అనే వ్యక్తి తండ్రి పేరు నాగ్య, వయస్సు 36 సంవత్సరాలు, వృత్తి నిరుద్యోగం, నివాసం.. ప్రస్తుతం వినోబా నగర్, జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
ఈ నేరస్తుడు తాను రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నట్టుగా “చాలామందికి ఉద్యోగాలకు ఇప్పించి నట్టు” నమ్మబలికి “అందరినీ తన వలయంలో నమ్మేలాగా చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి” లక్షల కొద్ది డబ్బులు తీసుకొని మోసం చేశాడు.
మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ చెందిన ఫిర్యాది అయిన భగవాన్ నాయక్ భార్య లీ లకి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఫిర్యాది వద్ద మొత్తం 24 లక్షల రూపాయలు తీసుకొని ఆ తర్వాత లీలా పేరు పై డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చినట్టు ఒక నకిలీ అపాయింట్మెంట్ కాపీ మరియు ఐడి కార్డును తయారు చేసి ఆ తర్వాత శర్మ అనే పేరుతో నకిలీ ఈమెయిల్ ద్వారా భగవాన్ నాయక్ కు పంపించి ఉద్యోగం ఇప్పించకుండా మరియు తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినాడు. భగవాన్ తన యూపీఐ ఐడి అకౌంట్ నెంబర్, ఆన్లైన్ లింక్ ద్వారా మంగు లాల్ కు డబ్బులు పంపినాడు.
మంగులాల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని భగవాన్ నాయక్ తో పాటు కొంతమంది బాధితుల వద్ద డబ్బులు తీసుకున్న వివరములు..
- మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ రమావత్ అనిత కి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తానని మాయ మాటలు చెప్పి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నారు.
- శాలిగౌరారం మండలం చిత్తలూరుకు చెందిన అంతయ్య భార్య గీత, చెల్లెలు కవితలకి కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి వారి వద్ద నుండి ఇద్దరు నుండి మొత్తం 19. 50 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సి ఆర్ నెంబర్ 98/2023, యు /ఎస్ 406,420,508, ఐపీసీ అఫ్ బౌ యనపల్లి పోలీస్ స్టేషన్.
- ఉప్పల్ కు చెందిన భూక్య, నరేష్, బోడ శ్రీకాంత్ లకు కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తానని మాయ మాటలు చెప్పి ఇద్దరి వద్ద తలా 6.50 లక్షల చొప్పున మొత్తం 13లక్షలు తీసుకున్నాడు, ఇంతే కాకుండా ఉప్పల్ కి చెందిన నగేష్ కి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అతని వద్ద నుండి 4.50 లక్షలు తీసుకున్నాడు. సి ఆర్ నెంబర్ 22/2023, యు /ఎస్ 408,420 ఐపీసీ ఆఫ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్.
- ఎల్బీనగర్ కు చెందిన బానోతు నరసింహారావు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి 9.5 లక్షలు తీసుకున్నాడు. సి ఆర్ నెంబర్ 22/2023,యు /ఎస్ 408,420, 34 ఐపిసి ఆఫ్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్.
- 2021 నవంబర్, డిసెంబర్ నెలలో మిర్యాలగూడ మండలం దుబ్బ తండ శ్రీనివాస్ నగర్ కి చెందిన అశోక్ మాలోత్ హరిబాబు, యుగ న్, లకు కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆ ముగ్గురు వద్ద నుండి తల 4 లక్షలు చొప్పున మొత్తం 12 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సి ఆర్ నెంబర్ 46/2023, యు /ఎస్ 420 ఐపీసీ ఆఫ్ మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్.
- ఉప్పల్ చెందిన హరితకి కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుండి మొత్తం 3.50 లక్షల రూపాయలు తీసుకున్నాడు.
- ఉప్పల్ కు చెందిన సౌందర్య కి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడు.
- డోర్నకల్ కి చెందిన మహబూబ్ అలీ కి కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అతని వద్ద నుండి మొత్తం 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు.
తేదీ 18.02.20 23న ఉదయం సమయం న “భూక్య మంగులాల్” ని మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ లో పట్టుకొని ఆ తర్వాత అతన్ని రిమాండ్ కు పంపానైనది.
మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి ఆధ్వర్యంలో మిర్యాలగూడ టూ టౌన్ సీఐ ఎన్. సురేష్, ఎస్సై డి. వెంకటేశ్వర్లు మరియు పోలీస్ సిబ్బందికి మిర్యాలగూడ డిఎస్పి వెంకటగిరి అభినందించారు.






Very sad