ఏడుపాయల్లో వైభవంగా శకట భ్రమణోత్సవం

Spread the love

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19

ఏడుపాయల వన దుర్గాదేవి జాతర ఉత్సవాలు రెండవ రోజైన ఆదివారం నాడు శకట బ్రహ్మణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శకట భ్రమణోత్సవం ఎడ్ల బళ్ళ ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లక్షలాది భక్తులు తిలకించడం తో ఏడుపాయల ప్రాంగణమంతా భక్తజనంతో పోటెత్తారు. ఎడ్ల బండ్ల ఊరేగింపు, శివసత్తులశిగాలు, పోతరాజుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఏడుపాయలకు భారీ గా తరలివచ్చిన భక్త జనం మంజీరలో ని చెక్ డ్యాం,స్నానఘట్టాలు,శవరబాత్ ల వద్ద పుణ్య స్నానాలను భక్తులు ఆచరించి, భక్తిశ్రద్దలతో వన దుర్గాదేవిని దర్శించుకున్నారు. జాతరలో అతి ప్రధానమైన బండ్ల ఊరేగింపు రంగురంగుల చీరలు, వేప కొమ్మలతో అలంకరించిన ఎడ్ల బండ్లు, రంగురంగుల మెరుపు కాగితాలు, దేవతామూర్తుల పటాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన గుమ్మటాల బండ్ల ఊరేగింపులో లక్షలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దుర్గాదేవి అమ్మవారికి జై జై అంటూ భక్తులు కొండలు దద్దరిల్లేలా నినదించారు. జాతర రెండవ రోజు ఇక్కడ బండ్లు తిరిగే కార్యక్రమం ప్రధాన ఆకర్షణ. బండ్ల ఊరేగింపు ముందు శివసత్తుల పూనకంతో శిగాలుగుతుండగా శకట బ్రమనోత్సవం ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం మొట్టమొదటిగా పాపన్నపేట సంస్థానాధీశుల తరఫున పాపన్నపేట సుంకరి పెద్ద కిష్టయ్య వారి బండి తిరుగగా, వెనుక వందలాది ఎడ్ల బండ్లు వాటిని అనుసరించాయి .మొదట తిరిగే పాపన్నపేట సంస్థానాధీశుల బండికి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్,ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి, ఏడుపాయల ఆలయ పాలకమండలి ఛైర్మెన్ సాతేల్లి బాలాగౌడ్,డిఎస్పీ సైదులు,ఈఓ సార శ్రీనివాస్, తదితర అధికారులు ఘన స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి ఏడుపాయల్లో బండ్లు తిప్పే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బండ్ల ముందు బైండ్ల వారి డప్పు మోతలకు అనుగుణంగా యువకులు, జోగిని భక్తులు నాట్యంచేస్తూ సర్వం మరచిన యువత దుర్గా దేవిని స్తుతిస్తూ, చిందులేస్తూ ,నాట్యం ,డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను లక్షలాది మంది భక్తులు చెట్లు, కొండలు, కోనలు, భవనాలు, వాహనాలు పైకి ఎక్కి పరవశించి పోయారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. శివసత్తులు బండ్ల ముందు శిగాలుగుతూ నృత్యాలు చేస్తూ ,బోనాలు తీసే మహిళలు అమ్మవారికి వివిధ కళాత్మక కార్యక్రమాలు చేపట్టడం పలువురిని ఆకట్టుకున్నాయి. ఏడుపాయల భక్తులతో గుట్టలన్నీ నిండిపోయాయి .ఎటు చూసినా కిలోమీటర్ల మేర యాత్రికులు కనిపిస్తున్నారు.

ఏడుపాయల చుట్టూ రాగాల కొండ, కోనలు, చిట్టడవి, మంజీరా నది పాయలు, మంజీర సెలయేరు వన దుర్గాదేవి అమ్మవారు ఏర్పాటు చేసుకున్న ప్రకృతి రమణీయ దృశ్యాలు భక్తుల మనస్సులను దోచుకున్నాయి .అదివారం రోజు ఆలయ ప్రాంతమంతా పూర్తి జనారణ్యంగా మారిపోయింది. మిద్దెలు, మేడలు ,బంగళాలో ఉండే, పట్టణ ,గ్రామీణ ప్రాంతం వాసులకు కు మోదుగు తంగేడు వెదురు చలవ చాపలు కుటీర సౌధాలు మారాయి .ఏ చెట్టు ,గుట్ట ఏ వాహనం వంక చూసి నా చుట్టూ జన సమూహమే. ఏడుపాయల మహానగరంగా తలపించింది. బండ్ల ఊరేగింపు సమయంలో జాతర ప్రాంగణంలో ఇసుక వేస్తే రాలనంత జనం కిటకిటలాడింది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి