
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19
మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారం తో పాటు పైతర, సంగాయిపేట, చిన్నగన్పూర్, రంగంపేట గ్రామాల్లో శోభాయాత్రను నిర్వహించారు. పైతరలో యువజన సంఘ సభ్యులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా యూత్ ఐకాన్ యాబన్నగారి రవితేజ రెడ్డి మాట్లాడుతూ శివాజీ ఆశయాలు కొనసాగిస్తామన్నారు. ప్రతి ఏటా శివాజీ జయంతి ఘనంగా నిర్వహిస్తామన్నారు. శివాజీ చాటిన స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాటి రమేష్, మిద్దె షాదుల్ల, కోరం పల్లి సురేష్,అనిల్, యువకులు పాల్గొన్నారు. సంగాయిపేటలో భారత్ పెట్రోల్ పంప్ నుంచి శివాజీ విగ్రహం వరకు బ్యాండ్ మేలాతో భారీ ఊరేగింపు నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారంలో యువకులు జై శివాజీ జై జై శివాజీ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.





