మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ లో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం..

Spread the love

*వన దుర్గాదేవి ని దర్శించుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19

మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు,ఎంఎస్ఎస్ఏ యాక్టివిటీస్ చీఫ్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ లు వెల్లడించారు. ఏడుపాయల శ్రీ వన దుర్గాదేవి అమ్మవారిని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు,
మైనంపల్లి సోషల్ సర్వీసు యాక్టివిటీస్ నిర్వాహకులు మైనంపల్లి రోహిత్ లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ పాలకమండలి చైర్మన్ సాతేల్లి బాలాగౌడ్, ఈఓ సార శ్రీనివాస్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో హన్మంతరావు,రోహిత్ లకు ఘన స్వాగతం పలికారు. అలయ గర్భాలయంలో వన దుర్గాదేవి అమ్మవారికి హన్మంతరావు,రోహిత్ లు కుంకుమార్చన, వివిధ విశేష పూజలు ను చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారి అనుగ్రహాన్ని, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈఓ శ్రీనివాస్ లు అలయమర్యాదలతో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు,రోహిత్ లకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ తాను శాససభ్యునిగా కాకముందు నుండే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.1997 లొనే మైనంపల్లి సోషల్ సర్వీస్ ను స్థాపించినట్లు తెలిపారు.తాను ఎమ్మెల్యే కాక ముందే ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.కుమారుడు రోహిత్ మెడిసిన్ పూర్తి చేశాడని,మైనంపల్లి సోషల్ సర్వీస్ ద్వారా నా కుమారుడు రోహిత్ 3 నెలల్లో పూర్తిగా మెదక్ సెగ్మెంట్లో తిరిగి గతంలో ఉన్న సంబందాలతో ముందుకు వెళతాడాని తెలిపారు.
గ్రామాలలో పాఠశాలలను మాడల్ గా తీర్చిదిద్దుతామన్నారు.తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు పూర్తిచేయని పనులను కూడా పూర్తి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో మైనంపల్లి రోహిత్, మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు జి విష్ణువర్ధన్ రెడ్డి,మాజీ అధ్యక్షులు పి ప్రశాంత్ రెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకట్ రాంరెడ్డి,కొత్తపల్లి సొసైటీ చైర్మన్ త్యార్ల రమేష్,ఏడుపాయల మాజీ చైర్మన్ లు ఆర్ బాలకృష్ణారెడ్డి,పార్శీ నర్సింలు, సర్పంచులు బాపురెడ్డి,ఆలయ ధర్మకర్తలు యాదాగౌడ్,బాగారెడ్డి,ఉప్పరి వెంకటేశం,మనోహర్, ఎంపిటిసిలు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్