
మెదక్ జిల్లా, ప్రతినిధి( జనసముద్రం న్యూస్) ఫిబ్రవరి :18
ఏడుపాయల వన దుర్గ భవాని మాతను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్,మాజీమంత్రి వి సునిత లక్ష్మారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఏడుపాయలకు వచ్చిన మహిళా కమీషన్ చైర్మన్ సునీతారెడ్డికి ఆలయ చైర్మన్ సాతేల్లి బాలాగౌడ్,ఈఓ సార శ్రీనివాస్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.వన దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంజీరా నదిలో ఏర్పాటుచేసిన శివుడి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.ఆలయ మర్యాదలతో మహిళా కమీషన్ చైర్మన్ సునీతారెడ్డి ని ఛైర్మన్ బాలాగౌడ్,ఈఓ శ్రీనివాస్ లు సత్కరించారు.







