
సహాయ సహకారాలు అందించిన జనసేన పార్టీ కార్యకర్తలు,వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ సభ్యులు
జనసముద్రం న్యూస్, అల్లిపురం,ఫిబ్రవరి18,
మహాశివరాత్రి సందర్భముగా అల్లిపురం నేరెళ్ళ కోనేరు వద్ద కే యన్నార్ రెసిడెన్సీ వద్ద కేయాన్నర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు శివరాత్రి సందర్భముగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు,,ఈ కార్యక్రమం సందర్భముగా కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తనకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు,,ప్రతి సంవత్సరం వొచ్చే శివరాత్రి కన్న ఈ సంవత్సరం వొచ్చిన శివరాత్రి చాలా ప్రత్యేకమైనది అని శని వారం త్రయోదశి రోజున శివరాత్రి పర్వదినం రావడం చాలా విశేషం అని 140 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా శివరాత్రి పర్వదినం రావడం జరుగుతూ వుంటుందని చెప్పారు,,ఈ లాంటి సందర్భములో భూమి మీద వుండి శివరాత్రి పండగను జరుపుకోవడం నిజంగా ప్రజల యొక్క అదృష్టమని చెప్పారు,,శివరాత్రి పర్వదినం సందర్భంగా వార్డులో ప్రజలకు మరియు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మహా శివరాత్రి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు,,తాను వార్డులో ను దక్షిణ నియోజకవర్గం లోనూ చేస్తున్న సేవా కార్యక్రమాల వలన జనసేన పార్టీ బలపడాలని కోరారు,, అన్న దాన కార్యక్రమంలో తమ యొక్క భాగస్వామ్యాన్ని అందించిన వారికి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ సభ్యులకు వార్డ్ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు న కృతజ్ఞతలు తెలియజేశారు,,ఈ అన్నదాన కార్యక్రమలో జోగిందర్,తెలుగు లక్ష్మి, విఘ్నేశ్వరీ,త్రినాధ్,కేదార్నాథ్,బద్రీనాథ్,మరియు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు,,





