
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :18
దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరిశ్ రావ్,ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి ,మదన్ రెడ్డి వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో మంత్రి కి స్వాగతం పలికిన చైర్మన్ బాలాగౌడ్ వనదుర్గ సన్నిధి లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి,మదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షా

*మంత్రి హరీష్ రావు కామెంట్స్
మెదక్ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు అదర్శశoగా నిలుస్తుంది
తెలంగాణ ఏర్పడ్డాక ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నాం
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుంది
యాదాద్రి ని అద్భుతంగా తీర్చిదిద్దాం
కొండగట్టు కు రూ 1000 కోట్లు కేటాయించాం
రాష్ట్రంలో అన్ని దేవాలయాలను తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేస్తుంది
రాష్ట్ర ప్రజలుగర్వించే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారు ప్రభుత్వ బడ్జెట్ లో దేవాలయ అభివృద్ధి కి కృషిచేస్తున్నాం వేద పండితులు,బ్రాహ్మణుల సంక్షేమానికి కృషిచేస్తుంది దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నాం హిందుధర్మ పరిరక్షణకోసం ప్రభుత్వం కృషి చేస్తుంది
రాబోయే రోజుల్లో ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా కృషిచేస్తాం ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపుకలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జెడ్.పి.టి.సీలు, యం పిపిలు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.






