
జనసముద్రం న్యూస్, సైబరాబాద్ (ఫిబ్రవరి 17)
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద 23.524కిలోల గంజాయి, 03 సెల్ఫోన్లు, ఒక హోండా సిటీ కార్,రూ 2వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది శుక్రవారం మాదాపూర్ పీస్ లో ఏర్పాటు చేసిన విలేకురుల సమావేశం లో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలు వెల్లడించారు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సౌరవ్ సింగ్ (29), జయప్రకాష్( 26)రాధా (20) ముగ్గురు కలిసి హోండా సిటీ కార్ లో పోలీసులకి అనుమానం రాకుండా కార్ లో రహస్య క్యాబిన్ ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్నారు సమాచారం అందుకున్న మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి ఏస్ఐ అవినాష్ బాబు ఖానమెట్ ప్రాంతం లో వాహనాలు తనిఖీ చేస్తుండగా హోండా సిటీ కార్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకోని కార్ ని తనిఖీ చేయగా కార్ లో రహస్య క్యాబిన్ ఏర్పాటు చేసి అందులో గంజాయి విక్రయిస్తున్నారు నిందితులు గంజాయిని ఉత్తర్ ప్రదేశ్ లో విక్రయించడానికి కార్ లో తరలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నిందుతులు సౌరవ్ సింగ్ , జయప్రకాష్, రాధా వద్ద 23.524కిలోల గంజాయి, 03 సెల్ఫోన్లు, ఒక హోండా సిటీ కార్,రూ 2వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందుతులు తుమనాధ్, రమేష్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు
ఈ కేసును ఛేదించడం లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, ఏస్ఐ అవినాష్ బాబు, కానిస్టేబుళ్లు జగన్, వినయ్ కుమార్, యాదయ్య, రాజేంద్ర, వినయ్ దీపక్ లను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ శిల్పవల్లి అభినందించి తగు రివార్డ్ లను ప్రకటించారు






