
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 17:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురు మహిళ కూలీలను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు.దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన నిరుపేదలైన..రెక్కాడితే గాని డొక్కాడని కూలీపని చేసుకునే మహిళా కూలీలు నాగలక్ష్మి,,ధనలక్ష్మి, అనసూయ,శిరీష మృతి చెందడం బా దకరమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ విచారం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…
మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని,భాదిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ఇండ్లు మంజూరు చేయాలన్నారు.





