
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 17.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆది మూలం అయిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదినo సందర్భంగా పినపాక జెడ్పిటిసి దాట్ల సుభద్ర దేవి, వాసు బాబు ఆధ్వర్యంలో జననేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను, దుగ్నేపల్లి సర్పంచి మలిపెద్ది సత్యవతి, వెంకన్న,ఎంపీటీసీ ఎక్కడి ఉమాదేవి,సత్యనారాయణ, పోకల రాజాపతిరావు, బిల్లం సాంబశివరావు, బత్తుల నందకుమార్, బత్తుల చిన్న లక్ష్మి నారాయణ, పిట్టల లక్ష్మీనారాయణ ,వేంపల్లి రవితేజ, చేగర్శల సర్పంచ్ గొలుసుల నాగేశ్వరరావు, టీ కొత్తగూడెం గ్రామ అధ్యక్షుడు తొండపు నరేష్ సమక్షంలో దుగ్గినేపల్లి జడ్పీపిఎస్ పాఠశాల నందు పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు అవసరమైన కంబాక్స్, పెన్నులు ప్యాడ్స్, మోడల్ పేపర్స్ ,ఆల్ ఇన్ వన్ బుక్స్ ,పదో తరగతి పరీక్షకు సంబంధించిన మెటీరియల్ ను ప్రభుత్వ పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు రవికుమార్ సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





