పినపాక మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ “అధినేత -జననేత” జన్మదిన వేడుకలు.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 17.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఏడుళ్ళ బయ్యారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినo సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు కంది సుధాకర్ ఆధ్వర్యంలో పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్, పెన్నులను స్థానిక సర్పంచ్ కోరం రజని, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, అపర భగీరథుడు, బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయన్నారు.తెలంగాణ అభివృద్ధి ఫలాలను ప్రజలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని, ఒకవైపు సంక్షేమo – మరోవైపు అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసిఆర్ కిట్లు, బీసీలు, ఎస్సీలు ఎస్టీల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు సమానంగా న్యాయం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగ హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమమoలో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు యాంపాటి సందీప్, నాయకులు కలిసి మొక్కలను నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో పినపాక సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే జాంగిర్, పినపాక నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్, సీనియర్ నాయకులు, ముల్లంగి వెంకట్ రెడ్డి, స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బూర రమేష్, పార్టీ యువజన నాయకులు పోతునూరి సంతోష్, పార్టీ సోషల్ మీడియా సభ్యులు పాపాల వీరబాబు, రాము, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి