శతాధిక కవులకు పురస్కారాలు -కవితా పోటీలు

Spread the love

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి ( ఫిబ్రవరి 17)

ఎస్.వీ ఫౌండేషన్ -తెలుగు వెలుగు సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సాహితీ సంబరాలు-శతాధిక కవులకు పురస్కారాలు,కవితా పోటీలను నిర్వహించనున్నట్లు ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ మోటూరి నారాయణరావు, తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ అధ్యక్షులు పీఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగాది కవితా పోటీలను తెలుగు వెలుగు సాహిత్య వేదిక ప్రధాన సలహాదారులు కిలపర్తి దాలి నాయుడు మాస్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మీసాల చిన గౌరి నాయుడు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి హెచ్ వి రమాదేవి, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నవనీత రవీందర్, తెలుగు వెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు లంకా వెంకటస్వామి,గంటా మనోహర్ రెడ్డి,పిళ్ళా వెంకట రమణ మూర్తి , డాక్టర్ రాజు సతీశ్ కుమార్ పర్యవేక్షణలో హైదరాబాద్ నగర శివార్లలో నిర్వహించటం జరుగుతుందని,ఈ పోటీల్లో విజేతలకు సంస్థ తరపున బహుమతులను, ఉత్తమ కవులకుబిరుదులు, ప్రదానం చేస్తోంది అలాగే 116 ఉత్తమ కవితలను ఎంపిక చేసి ఉగాది పంచాంగంతో పాటు ఉగాది షడ్రుచులు కవితా సంకలనం పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖుల చే నిర్వహించటం జరుగుతుందని తెలిపారు
ఉగాది సాహితీ సంబరాలలో కవితా పోటీలలో కవితా అంశాలు
ఉగాది,తెలుగు భాష,మన సంస్కృతి, సంప్రదాయాలు, మహిళా సాధికారత,
సామాజిక స్ఫూర్తిదాయక కవితలు అంశాలలో ఏదోకటి ఎంచుకుని కవిత వ్రాయాలని పేర్కొన్నారు. ప్రధమ శ్రేణి కవితకు
3,116/- నగదు బహుమతి , బిరుదు ప్రదానం,ప్రశంసా పురస్కారం,జ్జాపికా సత్కారం
ద్వితీయ శ్రేణి ఉత్తమ కవితకు
2,116/-నగదు బహుమతి, బిరుదు ప్రదానం, ప్రశంసా పురస్కారం జ్జాపికా సత్కారం,
తృతీయ శ్రేణి కవితకు
రూ.1,116/- నగదు బహుమతి, బిరుదు ప్రదానం ప్రశంసా పురస్కారంజ్జాపికా సత్కారం
మరో 10 ఉత్తమ కవనాలకు సమ్మోహన కవితగా పరిగణిస్తూ ప్రోత్సాహ కవితలకు కవన కిరణం బిరుదు ప్రదానంతో పాటు
రూ. 516/- నగదు బహుమతి
ప్రశంసా పురస్కారం
జ్జాపికా సత్కారం
116 ఉత్తమ కవితలకు :
కవి శ్రేష్ట బిరుదు ప్రదానం
ప్రశంసా పురస్కారం
జ్జాపికా సత్కారం నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. మీ కవితలను ఫిబ్రవరి 20 వ తేది లోపుగా పోటీ కవితలను
9346250304 నెంబర్ కు వాట్సప్ ద్వారా ఎంట్రీలు పంపాలని మోటూరి నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి