
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 17)
శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యని పరిష్కరించాలంటూ లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు వినతి పత్రం అందచేశారు. కార్పొరేటర్ సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత వాటర్ వర్క్స్ అధికారులకు త్వరగా డ్రైనేజీ పనులను చేపట్టి పూర్తిచేయాలనీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, అధ్యక్షులు సోమ్మయ్య యాదవ్, జనరల్ సెక్రటరీ శ్రీశైలం యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, పులి సాయి, సతీష్ గౌడ్, మధు, వినయ్ యాదవ్, దేవులపల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు





