
- కొల్చారం ఎమ్మార్వో కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు…
- మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :16:
- మెదక్ జిల్లా కొల్చారం
మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని మండలంలోని జర్నలిస్టులు గురువారం కొల్చారం తహసిల్దార్ చంద్రశేఖర రావుకు వినతి పత్రం సమర్పించారు. గతంలో పోలీస్ స్టేషన్ సమీపంలో జర్నలిస్టుల కోసం కేటాయించిన స్థలం ను మండలంలోని జర్నలిస్టులందరికీ కేటాయించాలని తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బిక్షపతి, శ్రీధర్ ,పాండురంగ చారి, నవీన్, భూపాల్, సిద్దు, వంశీ ,భూమయ్య ,దుర్గాప్రసాద్, రవి , పురుషోత్తం, ప్రవీణ్, శ్రీశైలం ,యాదగిరి , దితరులు పాల్గొన్నారు.





