పోలీసు నియామకాల్లో గర్భిణీ అభ్యర్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానిది హేయమైన చర్య..

Spread the love
  • బి జె వై ఏం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 16

ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డ్ తప్పిదాలతో కోర్ట్ మొట్టికాయలు, యువమోర్చా పోరాటం ఫలితంగా 7 మార్కులతో అర్హత సాధించిన అభ్యర్థులల్లో గర్భిణులను తప్పక ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో తప్పకుండా పాల్గొనాలని అధికారాలు అనడం సిగ్గుచేటు, కనీస మానవీయ కోణంలో ఆలోచనలేని ప్రభుత్వం, అధికారులు ఉండటం తెలంగాణ దౌర్భాగ్యంగా భావిస్తున్నాం,

నియమాలు పొరపాట్లు, ప్రశ్న పత్రాల్లో తప్పులు, ఏర్పాట్లలో డొల్లతనం, పోటీలలో పాల్గొన అభ్యర్థులకు కనీస అవసర ఏర్పాట్లు చేయటంలో పూర్తిగా విఫలమైన బోర్డ్ తప్పిదాలను అన్నింటిని కప్పిపుచ్చుకుని,

ఉత్తీర్ణత సాధించిన మహిళ అభ్యర్థుల్లో ఉన్న గర్భిణులు డైరెక్ట్ గా మెయిన్స్ పరీక్షల్లో పాల్గొనవచ్చని, మెయిన్స్ లో సెలెక్ట్ అయిన వారికి తరువాత ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని అధికారికంగా తెలిపిన విషయాన్ని కాదని ఇప్పుడెలా వందలాది గర్భిణులను ఏవిధంగా ఫిజికల్ పరీక్షల్లో పాల్గొనమని చెప్తారు?

ఏండ్ల తరబడి ఉద్యోగలకోసం ఎదురు చూస్తున్న మహిళ అభ్యర్థుల పట్ల ఇంతటి హేనమైన విధానాన్ని అవలంభించడం ప్రభుత్వం, అధికారులకు రాష్ట్రంలోని మహిళల పట్ల వారి వివక్షతకు పరాకాష్ట.

గర్భిణీ మహిళల పరిస్థితిని అర్థం చేసుకోలేని మూర్ఖులు అధికారం ఉండి మనల్ని పాలించడం రాష్ట్రానికే కళంకం.

రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో గర్భిణీలకు మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తరువాత ఫిజికల్ పరీక్షలు నిర్వహించాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో యువమోర్చా ఆధ్వర్యంలో అభ్యర్థులతో కలిసి పెద్ద సంఖ్యలో డి.జి.పి ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి