బి ఆర్ ఎస్ నేతల గుండెల్లో గుబులు: గొడిశాల రామనాథం.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 16.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో భాగంగా పినపాక నియోజకవర్గం లో 13వ తారీకున టీపీసీసీ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందని ఈ పాదయాత్రకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రేవంత్ రెడ్డి కి బ్రహ్మానందం పట్టారని పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం అన్నారు. ఈ సందర్భంగ బయ్యారం క్రాస్ రోడ్ నందు గల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడు పోదం వీరయ్య ఆదేశాల మేరకు హత్ సే హత్ జూడో యాత్రకు 2000 మంది కార్యకర్తలతో అశ్వాపురం నుండి మణుగూరు అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్రలో పాల్గొనడం జరిగిందన్నారు. టిపిసిసి రేవంత్ రెడ్డి పాదయాత్రకు నియోజకవర్గంలో ఏడు మండలాల నుండి స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావడం అనేది భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శుభసూచకమని అన్నారు. ఈ పాదయాత్ర జన సందోహాన్ని చూసిన అధికార పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గుండెల్లో గుబులు మొదలైందని తధనుగుణంగా ఏం చేయాలో దిక్కుతోచక సామాజిక మాధ్యమాల ద్వారా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారన్నారు. ఈ ప్రభంజనాన్ని చూసిన అన్ని పార్టీల నాయకుల నోట గుసగుసలు వినిపిస్తున్నాయని,2018 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో 20వేల మెజారిటీతో గెలిచిన కాంతారావు పార్టీ మారడం వలన అదే ప్రజల చేతుల్లో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని ప్రజలు అనుకుంటున్నారన్నారు.ఏ సమయంలో ఎలక్షన్లు వచ్చిన పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి