
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 16:
మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఏమిటంటే.. శాంతినగర్ కాలనీలో వృద్ధురాలైన ఓ మహిళ నాలుగు తులాల బంగారు గొలుసును మెడలో వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా .. ఈ విషయాన్ని గమనించిన గుర్తుతెలియని చైన్ స్నాచింగ్ దొంగ.. ఈ మహిళ వెనుక వైపు నుండి వచ్చి మెడలోని గొలుసును లాక్కొని తీసుకెళ్తుండగా అక్కడ స్థానికులు ఆ సమయానికి స్పందించి వెంటనే ఈ దొంగను పట్టుకొని బంగారపు గొలుసును ఆ వృద్ధురాలికి ఇచ్చి, దొంగకు దేహశుద్ధి చేయడం జరిగింది. ఈ దొంగను స్థానికులు 2 టౌన్ పోలీస్ అధికారులకు అప్పగించడం జరిగింది.
తస్మాత్ జాగ్రత్త.. మహిళలు బంగారం మెడలో వేసుకుని బస్సులలో, ఫంక్షన్లకు, ఆటోలలో ఇతర ఎక్కడికైన వెళ్లేటప్పుడు… చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి. ఎందుకంటే కొంతమంది దొంగలకు.. “మనిషి ప్రాణాలు” కంటే వారి జల్సాలకు డబ్బులు అవసరం కాబట్టి ఎంతవరకైన తెగించి వారు అనుకున్న సొమ్మును తీసుకెళ్ళేటట్టు ప్రయత్నిస్తారు.
కావున మహిళలు బంగారం మెడలో ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్లకుండా “నలుగురి మహిళలతో, మీకు తెలిసిన వారితో ” కలిసి వెళితే మంచిదని మనవి.






