
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 15:
సమస్త బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లావూరి వెంకన్న నాయక్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లాలోని "రాంజీ నాయక్" తండాలో జన్మించారని అన్నారు.ఈ సందర్భంగా బుధవారం త్రిపురారం మండలంలోని చెన్నైపాలెం ఉన్నత పాఠశాలలో "సంత్ సేవాలాల్ 284 వ జయంతి " ని పాఠశాల ఆవరణలో సేవాలాల్ చిత్రపటానికి పూల దండాలు, పూలు వేసి నివాళులు అర్పించారు.
సంత్ సేవాలాల్ గురించి లావూరి వెంకన్న నాయక్ మాట్లాడుతూ..
బంజారాలు సన్మార్గంలో నడవడానికి సేవాలాల్ చూపిన మార్గం నిదర్శనమన్నారు. నీతి, నిజాయితి అయన మార్గమాన్నారు. సేవాలాల్ చూపిన మార్గంలో బంజారాలు నడవాలని కోరారు.విద్యార్థిని, విద్యార్థులు కష్టపడి చదివి సన్మార్గంలో నడవడం ద్వారానే మహారాజ్ కు సరైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరథ్ నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు మక్ల నాయక్, శంకర్ నాయక్, సుజాత, ఉపాధ్యాయులు సత్యనారాయణ, అంజమ్మ, సైదులు, శ్రీదేవి, జ్యోతి, విజయలక్ష్మి.. లు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొని “సంత్ సేవాలాల్ మహారాజ్ “కు తమ నివాళులు అర్పించారు.





