
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 15:
మిర్యాలగూడ డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి.వెంకటగిరిని బుధవారం ఎస్సీ, ఎస్టీ,బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలిసి పూల మొక్కను ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మిర్యాలగూడ డివిజన్ లో అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కుల సంఘాలు చేపట్టే కార్యక్రమాలకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్, యాదవ సంఘం మిర్యాలగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగోండి మురళి యాదవ్, బీసీ జేఏసీ నాయకులు దాసరాజు జయరాజు,కుమ్మరి సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు మల్లికంటి వెంకటయ్య, యాదవ సంఘం జిల్లా నాయకులు కెపి రాజు బంజారా సంఘం జిల్లా నాయకులు జాను నాయక్ తదితరులు పాల్గొని డీఎస్పీ” పి. వెంకటగిరి” ని సన్మానించారు.





