
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 15 :
మిర్యాలగూడ పట్టణంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం కార్యాలయంలో మాల మహానాడు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ, అదే విదంగా భారతదేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతినిమాల మహానాడు జాతీయ అధ్యక్షులు “తాళ్ళపల్లి రవి” మరియు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు “మాడుగుల శ్రీనివాస్” ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితోపాటు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి బాబురావు, బెజ్జం సాయి ఎంపీటీసీల ఫోరం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొప్పని నగేష్, మాల మహానాడు విద్యార్ధి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి సురేష్, మాల మహానాడు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులునాగటి జోసఫ్, నాయకులు.. డి వి రత్నం, పేరపాక క్రిష్ణయ్య, రాములు, జనార్దన్.. లు , తదితరులు పాల్గొన్నారు.





