విద్యార్థుల ప్రతిభ ను ప్రోత్సహించడానికే మోడల్ టెస్టు లు:-వినొద్ నాయక్..

Spread the love

జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు, ఫిబ్రవరి 12:

కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు ధీరవత్ శ్రీను నాయక్ తెలిపారు.
“భారత విద్యార్థి ఫెడరేషన్” ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఆర్ ప్రీమియర్ స్కూల్లో పదో తరగతి విద్యార్థుల కు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ యొక్క టాలెంట్ టెస్ట్ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని విడుదల చేయడానికి ముఖ్య అతిథిగా‌ డివైఎఫ్ఐ మండల కార్యదర్శి వినోద్ నాయక్ మరియు మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధీరవత్ శ్రీను నాయక్ హాజరై ప్రశ్నా పత్రాన్ని విడుదల చేసి న అనంతరం వారు మాట్లాడుతూ..
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పదో తరగతి విద్యార్థులకు రేపు మార్చి నెలలో జరగబోయే పరీక్షల ముందు పదో తరగతి విద్యార్థులకు భయాన్ని పోగొట్టడం కోసం నిర్వహిస్తున్న ఈ టెస్ట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చదువు పోరాటం అనే స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఇలాంటి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీ ప్రపంచంలో నిలవాలంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యం వైపు వెళ్లాలంటే ప్రతి “విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే” నే ఉన్నత శిఖరాలకు వెళ్లగలరని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ కూతురుకి కొడుకు పదో తరగతిలో మంచి ఫలితాలు రావాలని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకం చేయకుండా ఉండాలంటే బాగా చదివి ఇలాంటి పోటీ పరీక్షలలో హాజరైతేనే ఎంతవరకు చదివినాము ఇంకా ఎంతవరకు కష్టపడితే విద్యార్థులు అనుకున్న “తమ స్థాయిని ” చేరుకోగలుగు తారని అంచనా వేసుకోవడం కోసం ఈ పోటీ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. ఎంతటి పేదరికని
జయించాలన్నా “ఏకైక అస్త్రం చదువు” ఒకటే మార్గం అన్నారు.


కరోనా తర్వాత విద్యార్థులు పాఠ్య పుస్తకాలకంటే ఎక్కువ “సెల్ ఫోన్ “లో సమయాన్ని వృథా చేయకుండా విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల సృజనాత్మక ను వెలికి తీయడం కోసం ఈ ప్రతిభా పరీక్షలు నిర్వహించిన భారత విద్యార్థి ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ ప్రత్యేకమైన ధన్యవాదాలు
పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దామరచర్ల మండల కేంద్రం లో దాదాపు 250 మంధి విద్యార్థులు ఈ పరీక్ష లో పాల్గోన్నారు.ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్, శివ, తరుణ్, విజయ్, అజయ్, అనీల్, వేణు, గణేష్ బాబు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి