జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 11:
మాదిగలు మరియు ఉప కులాలు, మహాజనులు, ప్రజాస్వామిక వాదులు, వీహెచ్పీఎస్ కదలిరండి .. అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం..
హైదరాబాద్- విజయవాడ ఫిబ్రవరి 13 తేదీన జాతీయ రహదారి దిగ్బంధం..
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా జాప్యానికి నిరసనగా 2023 సంవత్సరం, ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం ను మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ” భారీ జన సమూహంతో” జరగబోతుంది.
మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జాతీయ రహదారి దిగ్బందం చేయుటకు గల కారణాలు..
భారతదేశంలో ప్రస్తుతం పరిష్కారం జరగవలసిన సమస్యల్లో ప్రథమ స్థానంలో ఉన్న సమస్య “ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించడమని “మందకృష్ణ మాదిగ అన్నారు. నిజానికి నేడు దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం “నిర్లక్ష్యం” చెయ్యకపోతే ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధత జరిగి ఉండేద ని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ విషయంలో బిజెపి మాత్రమే ఏకైక దోషిఅని అన్నారు.ఎందుకంటే ఎస్సీ వర్గీకరణలో బిజెపికి 5 దశాబ్దాల అనుబంధం ఉంది, 1982 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఉదయగిరి ఎమ్మెల్యే గా వెంకయ్య నాయుడు ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో “ఎస్సీల” మధ్య అసమానతలు ప్రస్తావించి ఎస్సీ వర్గీకరణ చేయాలని మాదిగల ఆకాంక్షలను అసెంబ్లీలో వినిపించారు. ఆ తర్వాత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకై “జన సమూహంతో” కొనసాగిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం లక్షలాది మంది ప్రజలతో మహోత్తర ప్రభంజనంలా మారడంతో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బిజెపి పార్టీ’ సైద్దాంతికంగా’ బలపరిచింది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ” వెంకటేశ్వర స్వామి” సాక్షిగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత బలపరుస్తూ కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. 1999 సంవత్సరంలో నవంబర్ లో నాటి రాష్ట్రపతి కే.ఆర్ నారాయణ ణ్ ఆమోద ముద్రతో ఎస్సీ వర్గీకరణ అమలు కావడానికి వాజ్ పేయ్ నేతృత్యంలో ఎన్డీఏ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది. తదనాం తరం మధ్యలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించుటకు “కేంద్ర ప్రభుత్వం” జాప్యం చేస్తూ వచ్చింది. 2014 ఎన్నికల సందర్భంగా బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా “నరేంద్ర మోదీ” హైదరాబాద్ ప్రచారానికి వస్తే బిజెపి నేతలు స్వయంగా మందకృష్ణ మాదిగను ఆహ్వానించి మోదీతో మాట్లాడిస్తే “నరేంద్రమోదీ..మందకృష్ణ మాదిగకు ఎస్సీ వర్గీకరణ పై హామీ” ఇవ్వడం జరిగింది, ఈ హామీకి బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు,కిషన్ రెడ్డి సాక్షులుగా ఉన్నారని మందకృష్ణ మాదిగ అన్నారు. కేంద్రంలో అధికారం వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించి మాటతప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ పత్రాన్ని ప్రకటించలేదని మోదీ చేసిన “అన్యాయం “గురించి మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ పట్ల తమ ఆవేదనను వ్యక్తపరిచారు.
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కొరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ జరుగుతున్నందున తక్షణమే పార్లమెంట్ లో “ఎస్సీ వర్గీకరణకు” చట్టబద్ధ కల్పించి మాదిగలు,ఉప కులాలకు “న్యాయం “చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఇంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం “తమ సహనాన్ని “పరీక్షించవద్దని హెచ్చరించారు.