
రైల్వేకోడూరు, జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11:
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరంపోడు గ్రామం నందు క్షత్రియ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో ఫైనల్ మ్యాచ్ లో పాండిచ్చేరి,విజయవాడ జట్టులు తలపడగా ప్రధమ విజేతగా నిలిచిన విజయవాడ జట్టుకు, ద్వితీయ స్థానంలో నిలిచిన పాండిచ్చేరి జట్లకు విన్నర్ ట్రోఫీలు అందజేసిన జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు . వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, ఆదిరాజు వేణుగోపాలరాజు, వెంకటరెడ్డి, నాగేంద్ర ఉప సర్పంచ్ తోట శివ సాయి రైల్వే కోడూరు నియోజకవర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ , సిఐ విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.







