జనసముద్రం న్యూస్ ప్రతినిధి మల్కాజ్గిరి ఫిబ్రవరి 10
మానవసేవే మాధవసేవ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు జన్మదిన వేడుకలను, మానవసేవే మాధవసేవ వాట్సప్ గ్రూపు సభ్యులు కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కూడలిలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రూప్ సభ్యుల మధ్యలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. గ్రూప్ సభ్యులు కుమ్మరి రాజును శాలువాలతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు మొహమ్మద్ రషీద్,డాక్టర్ సుధాకర్,బిక్షపతి,మల్లేష్ యాదవ్, మహమ్మద్ సమీ,సత్యనారాయణ, అమర్నాథ్ తో పాటు స్థానికులు మిత్ర బృందం బైరు అనిల్, వెంకట్, రమణ, భాను, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.