
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 9:
తపాలా శాఖ ఆధ్వర్యంలో 9, 10 వ తేదీలలో దేశ వ్యాప్తంగా పోస్టాఫీస్ లలో "సుకన్య సమృద్ది యోజన మహా మేళా "జరగబోతుంది.
కేంద్ర ప్రభుత్వం 10స0″ల లోపు ఉన్న ఆడపిల్లల బంగారు భవిష్యత్ కోసం “సుకన్య సమృద్ది యోజన పథకం” ప్రవేశ పెట్టింది.
పోస్టాఫీస్ లో ఈ పథకం అకౌంట్ ఖాతాకు ఇవ్వవలసిన పత్రములు..
1.అకౌంట్ ఓపెనింగ్ రూ250 మాత్రమే చెల్లించాలి.
2.తల్లి లేదా తండ్రి & అమ్మాయి ఆధార్ జీరాక్స్.
3)తల్లి లేదా తండ్రి & అమ్మాయి 3 పాస్ ఫొటోస్.
4)అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ జీరాక్స్.
5)తల్లి లేదా తండ్రి పాన్ కార్డ్ జీరాక్స్ లేని యెడల ఫామ్ 60.
సుకన్య వడ్డీ రేటు అత్యధికంగా 7.6%
దృష్ట్యా ఈ క్రింది విధంగా లభించును..
1.నెలకు 250రూ కడితే 15 స0″ లకు 45000 రూపాయలు గడువు ముగిసే సరికి 1,27,593 రూపాయలు పొందండి.
2.నెలకు 1000 వెయ్యి రూపాయలు కడితే 15స0″లకు 1,80,000 రూ” లు గడువు ముగిసే సరికి 5,10,373రూ ” లు పొందండి.
ఎవరికైన సందేహాలు ఉంటే మిర్యాలగూడ తపాల శాఖ సిబ్బంది.. 9010508207 కు సంప్రదించగలరు.





