ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే ముందస్తు అరెస్టులు అప్రజాస్వామీకం:గిరిజన సంఘం నాయకులు మాలోతు వినోద్ నాయక్..

Spread the love

జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 9:

  రాష్ట్ర ప్రభుత్వం "అర్హులైన పేదలందరికీ" ఇండ్లు,ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ప్రజాసంఘాల పోరాట కమిటీ పిలుపుమేరకు "ఛలో హైదరాబాద్ "వెళ్తున్న ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేయడం ఆప్రజాస్వామిక చర్యని "గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మాలోతు వినోద్ నాయక్" అన్నారు.
  గురువారం చలో హైదరాబాదును అడ్డగిస్తూ ముందస్తుగా వాడపల్లి ఎస్సై రవి కుమార్ ఆదేశాల మేరకు  అరెస్ట్ చేసి వాడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వాడపల్లి పోలీస్ స్టేషన్ లో మాలోతు వినోద్ నాయక్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ..
రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాల పోరాట కమిటీ..జిల్లా స్థాయిలో, వివిధ రూపాలలో ఆందోళన, పోరాటాలు నిర్వహించిన పేదలంతా “ఛలో అసెంబ్లీ ఇందిరాపార్క్ ధర్నా”కు వెళ్తున్నారని మాలోతు వినోద్ నాయక్ అన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం,ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి అడ్డుకోవాలిసింది పోయి పోలీస్ అధికారులు ఇలా చేయడం సిగ్గుచేటని అన్నారు.
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు..అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని వినోద్ నాయక్ అన్నారు. ఈ అరెస్టులను అధిగమించి వేలాదిమంది హైదరాబాదుకు “ధర్నా కు “తరలి వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పురాణాలోచన చేసి గుడిసె లేసుకున్న పేదలకు ఇళ్లపట్టాలిచ్చి,ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని పేదలకు ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేలాదిమంది 125 గజాల స్థలం కలిగి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ ఆర్థిక సహకారం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
వాడపల్లి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ వారిలో వినోద్ నాయక్ తో సిపిఎం, సిఐటియు, వివిధ ప్రజా సంఘాల నాయకులు.. పాపా నాయక్, సుభాని , రవి, పిచ్చయ్యతదితరులు ఉన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి