అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ ప్రధమ వర్ధంతి సభలను జయప్రదం చేయండి

Spread the love

ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ పిలుపు

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 09)

శేరిలింగంపల్లి లోని మియాపూర్ లో ఈ నెల 14 నుండి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగు యంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహిస్తూ మరణించిన అమరజీవి అయిన కామ్రేడ్ తాండ్ర కుమార్ ప్రధమ వర్ధంతి కార్యక్రమాల పోస్టర్ ను గురువారం నాడు ముజాఫర్ అహ్మద్ నగర్ లోని ఎం సిపిఐ యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాండ్ర కుమార్ ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 14 నాడు మియాపూర్ లోని అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ స్మారక స్థూపం నుండి ముజాఫర్ అహ్మద్నగర్ వరకు ప్రదర్శన అనంతరం విగ్రహావిష్కరణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రధమ వర్ధంతి సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కామ్రేడ్ తాండ్ర కుమార్ రంగారెడ్డి జిల్లా,గ్రేటర్ హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ గ్రామంలో 1962లో తాండ్ర రామచంద్రయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఏడవ సంతానంగా జన్మించారని,తన స్వగ్రామం మియాపూర్లో పటేల్,పట్వారిగిరికి వ్యతిరేకంగా ప్రారంభమైన తన ఉద్యమ ప్రస్థానం రాష్ట్రంలో దేశంలో ఎంసిపిఐ(యు)పార్టీని రాజకీయంగా, సైద్ధాంతితకంగా నిలబెట్టడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని, హైదరాబాద్ మహానగరంలో పేదలకు ఇళ్ల స్థలాలు స్వాధీన పోరాటంలో అనేక నిర్బంధాలను,ప్రభుత్వ యంత్రాంగం యొక్క తప్పుడు కేసులను, కర్కశమైన పోలీస్ ధమన కాండను ఎదుర్కొన్నాడని, నిలువ నీడలేని అణగారిన ప్రజలకు నీడ కల్పించడం కోసం సాగిన వారి పోరాట మజిలీలో 42 కేసులు పెట్టబడ్డాయని,నాలుగు సార్లు జైలు జీవితం గడిపారని,అలాగే అర్ధ రహస్య జీవితాన్ని కూడా గడిపారని, ప్రజలం కోసం మరణిస్తాను తప్ప ఈ కేసులు, జైలునిర్బంధాలకు జడిసి ఉద్యమ బాటను వీడనన్నారని,ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం యొక్క తప్పుడు కేసులను,నిర్బంధాలను రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఎదురుదాడులను ఎదుర్కొంటూనే కామ్రేడ్ తాండ్ర కుమార్ టేకు నరసింహనగర్,పోగుల ఆగయ్య నగర్,స్టాలిన్ నగర్,ముజఫర్ అహ్మద్ నగర్,నడిగడ్డ తాండ, సుభాష్ చంద్రబోస్ నగర్,ఓంకార్ నగర్, గోపాల్ రెడ్డి నగర్,భగత్ సింగ్ నగర్ తదితర దాదాపు 17 కాలనీలు ఏర్పాటు చేసి మహత్తర ప్రజా పోరాటాలు నడపడంలో మడమ తిప్పని ప్రజానాయకుడిగా పేరుపొందారని,ఆయన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అమర జీవులు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్,కామ్రేడ్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పోరాటతత్వాన్ని పునికి పుచ్చుకొని తొలుత ఐక్య యువజన సమైక్య (యువైఎఫ్) రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా, ఎంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శిగా,గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిగా,తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా,పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, కళాకారునిగా,కార్మిక నేతగా బహుళ ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారని,పలు సందర్భాలలో జరిగిన ఎన్నికలలో కార్పొరేటర్ గా,శాసనసభ సభ్యునిగా ఎంసిపిఐ(యు)అభ్యర్థి గా పోటీ చేశారని సోషలిస్టు రాజ్య స్థాపన కావాలంటే ముందుగా కమ్యూనిస్టులు ఐక్యత కావాలని,ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని నూటికి 93 శాతం ఉన్న బహుజన ప్రజానీకానికి ఆర్థిక,సామాజిక రాజకీయ సమానత్వం జరగాలని,వారికి బహుజన రాజ్యాధికారం సాధించాలని తపించి మొదటి నుండి ఆయన అణగారిన ప్రజల పక్షాన ఉండి రాజకీయంగా సైద్ధాంతికంగా ప్రజలను చైతన్యం చేస్తూ వచ్చారని, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సమాజమే కుటుంబం గా భావించి ఏనాడు పార్టీ కార్యక్రమాలకు, ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉండలేని త్యాగ జీవి ఆయన అని, సుదీర్ఘంగా వైద్యం చేయించుకుంటూ లివర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 2022 ఫిబ్రవరి 14 ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో తుదిత్వాస విడిచారని,ఆయన త్యాగాలను, పోరాట ఘట్టాలను మరింత స్మరిస్తూ వారి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఘనంగా నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మియాపూర్, ముజఫర్ అహ్మద్ నగర్ లలో జరుగు కామ్రేడ్ తాండ్ర కుమార్ స్మారక స్థూపం నుండి ప్రదర్శన, ముజఫర్ అహ్మద్ నగర్ లో మధ్యాహ్నం 1గంటలకు విగ్రహావిష్కరణ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రధమ వర్ధంతి సభ విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలనిఅన్నారు.ఈకార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యదర్శివర్గ సభ్యులు వి.తుకారాం నాయక్, కర్ర దానయ్య, తాండ్ర కళావతి, పల్లె మురళి, లసాని రాజు,ఇ. దశరత్ నాయక్ మరియు సభ్యులు యం.రాములు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి