
మెదక్ జిల్లా, ప్రతినిధి. ఎర్ర. పురుషోత్తం (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి:8
కోనాపూర్ లో బుధవారం రాత్రి జ్యోతిర్లింగ మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రంగంపేట సహకార సంఘం ఉపధ్యక్షుడు మోతుకు మల్లేషం ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్మెన్ సునీతలక్ష్మారెడ్డి,నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శివ స్వాముల భక్తి పాట లు, శివనామ స్మరణ తో మారుమోగింది.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. కోల్చరం ఎంపీపీ కోరబోయిన మంజుల కాశి నాథ్, జెడ్పీటీసీ ముత్యం గారి మేఘమాల టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్, సంతోష్, యువజన విభాగం మండల అధ్యక్షలు తుంకులపల్లి సంతోష్ రావు, , మాజి జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి ,ఆత్మ కమిటీ డైరెక్టర్ అంజనేయులు ,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ కన్నరం రమేష్, మాజీ సర్పంచ్ వెంకటేశం, ఉపసర్పంచ్ సుకన్య మధు సుధన్ రెడ్డి, కొల్చారం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సోమ నర్సింలు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేశం వెల్మ కన్న సర్పంచ్ కాజీపేట రాజీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బిజెపి దుర్గయ్య బిజెపి మండల అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.





