నిరుపేదలకు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ వెంకట్రాంరెడ్డి

Spread the love

ప్రజా ప్రతినిధులు : సత్యనారాయణ గౌడ్, బాబుల్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, భగవన్ రెడ్డి

మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 9

కంటి వెలుగు పథకం నిరుపేద లకు ఎంతో మేలు చేస్తుందని సర్పంచ్ వెంకట్ రామ్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ గ్రామంలో గురువారం రోజున కంటి వెలుగు పథకాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసి గ్రామ సర్పంచ్ నాగులపల్లి వెంకట్ రామ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించడంతో నిరుపేదలకు కచ్చితంగా కంటి పరీక్షలు మందులు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. కంటి వెలుగు పథకాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా వారి వారి రాష్ట్రాల్లో అమలు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ శ్రీనివాసరావు , రాంగిరి రమేష్, రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, గడ్డి వెంకటేష్ యాదవ్, తూప్రాన్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కావేరి భగవాన్ రెడ్డి, ఎంపిటిసి నరసమ్మ, సర్పంచ్ నాగులపల్లి వెంకట్రాంరెడ్డి, ఉప సర్పంచ్ మల్లమ్మ, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, డాక్టర్లు ఆనంద్, డాక్టర్ అపర్ణ, ఏంఏన్ ఏం జ్యోతిలక్ష్మి, ఆశ వర్కర్ లక్ష్మి, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు,నాయకులు రాజు ఇస్లాoపుర్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి