
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 8:
మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం వాహనముల ట్రాఫిక్ ఉల్లంఘన పై వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు “స్పెషల్ డ్రైవ్ “నిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ ను వన్ టౌన్ ట్రాఫిక్ ఎస్సై కోటేశ్వర్ ఆధ్వర్యంలోనిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో వాహన చోదకుల వాహనములకు నెంబర్ ప్లేట్స్ లేని వాహనములు,
18 సంవత్సరాల లోపు ఉన్నవారు నడిపిన వాహనములు మొత్తం 30 వాహనములను స్పెషల్ డ్రైవ్ లో పట్టుకున్నామని ఇందులో 28 వాహనములు నంబర్ ప్లేట్ లేని వాహనములని ట్రాఫిక్ వన్ టౌన్ ఎస్ఐ కోటేశ్వర్ తెలిపారు. వీరిపై ఎం వి యాక్ట్ ట్రాఫిక్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, వీరికి ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఫైన్లు వేసి చలాన్లు ద్వారా ట్రాఫిక్ హెడ్ ఆఫీస్ కు ఈ సేవ కేంద్రం ద్వారా వాహనచోదకులు డబ్బులు ఫైన్ కట్టడం జరిగింది. వీరికి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కలుగు పరిణామాల గురించి తెలిసే విధంగా.. రాంగ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, రోడ్లపై వాహనములకు అధిక శబ్దంతో సైలెన్సర్లను అమర్చి నడపడం, అధిక స్పీడుతో నడపడం, మద్యం సేవించి వాహనములు నడపడం తదితర వాటి వల్ల వాహనములు రోడ్లపై నడిచే ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా నడిపితే “కఠిన చర్యలు ” తప్పవని వాహన చోదకులకు కౌన్సిలింగ్ ఇచ్చి వాహన చోదకుల వాహనములకు నెంబర్ ప్లేట్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపి వాహనములను వన్ టౌన్ ఎస్ఐ కోటేశ్వర్ అందజేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో మిర్యాలగూడ వన్ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ తో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





