గ్రామ గ్రామాన అభివృద్ధి బి ఆర్ ఎస్ తోనే సాధ్యం: పగడాల సతీష్ రెడ్డి.

Spread the love

-పినపాక ఏజెన్సీ గ్రామాల రోడ్లకు 2 కోట్ల 30 లక్షల రూపాయల నిధుల మంజూరు.

  • విప్ రేగా సారథ్యంలో ప్రగతి దిశగా పల్లెలు.
  • మరో నెల రోజుల్లో మండల వ్యాప్తంగా మట్టి రోడ్డు అనేది కనిపించదు.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక ,ఫిబ్రవరి 9.

పినపాక మండలంలో రానున్న రోజుల్లో గ్రామాల్లోని ప్రతి వీధిలో సీసీ ,బీటి రోడ్ల నిర్మాణాలకు తగిన అనుమతులు మంజూరు చేయించి, పూర్తి చేస్తామని పినపాక మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బయ్యారం క్రాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో మండల నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పినపాక మండలంలోని మారుమూల గ్రామాల రోడ్ల కొరకు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు 2 కోట్ల 30 లక్షల రూపాయలను మంజూరు చేయించారన్నారు. నీళ్లు ,నిధులు, నియామకాలు, సంక్షేమం, అభివృద్ధి అనే నినాదంతో పినపాక నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు సారద్యంలో రాష్ట్రంలోనే ముందు స్థానంలో నిలిచిందన్నారు.పినపాక మండలానికి ఫైర్ స్టేషన్ సైతం మంజూరు అయిందన్నారు. మరికొద్ది రోజుల్లో మండల వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అడుగడుగున రోడ్ల నిర్మాణం జరుగుతుందని, మట్టి రోడ్డు అనేది కనిపించదని తెలిపారు. పినపాక మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ, ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి నిరంతరం శ్రామికుడిలా కృషి చేస్తున్న విప్ రేగా కాంతారావుకు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు పినపాక మండల ప్రజల తరఫున సతీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్, పిఏసిఎస్ చైర్మన్ రవి శేఖర్ వర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, రైతుబంధు అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసుబాబు, అమరారం ఎంపీటీసీ ఖాయం శేఖర్, అమరారం సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సోంపల్లి తిరుపతి, పార్టీ మండల నాయకులు రాయల సత్యనారాయణ, గాండ్ల అశోక్, వారా నరసింహరావు, గుమ్మడి అశోక్, కోరం జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి