మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ రేగా సతీమణి సుధారాణి.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 9.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి విస్తృతంగా పర్యటించారు.ఇటీవల వివిధ కారణాలతో మరణించిన కుటుంబ సభ్యుల నివాసాలకు వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.దీనిలో భాగంగా ఇనపాల విజయ్ కుమార్ (22), యర్రం శెట్టి రాధ (60), కోట్ర శివ (27) సంవత్సరాలు, నూనే మంతల శ్రీను (40), చింత వెంకటేశ్వర్లు (37) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం మరణించడంతో మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి దశదినకర్మలకు హాజరయ్యారు. అదేవిధంగా జంపన వెంకట అప్పల నరసింహారాజు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో వారినివాసానికి, పొత్తురి శ్రీనివాస్ రాజు ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేపించుకుని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు కుటుంబాలకు 5000 రూపాయలు చొప్పున, మొత్తం 25 వేల రూపాయల నగదును, అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం చొప్పున బాధిత కుటుంబ సభ్యులకు రేగా సుధారాణి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేసి వారు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సొసైటీ చైర్మన్ డాక్టర్ ముదునూరి రవి శేఖర్ వర్మ, మండల సొసైటీ డైరెక్టర్ పటేల్ కామేష్, జానంపేట సర్పంచ్ బాడిషా మహేష్, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్, పినపాక నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్, మండల యువజన విభాగం అధ్యక్షుడు గాండ్ల అశోక్, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుండు దామోదర్, నాయకులు సూరినేని ధర్మయ్య,జి వినయ్, శ్రీనివాసరావు, సుగ్యాల శశికాంత్, సుగ్యాల శ్రీకాంత్, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది రేగా రవి, బొండబోయిన ఉమామహేశ్వరరావు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి