
జనసముద్రం న్యూస్ మల్కాజ్గిరి మేడ్చల్ ఫిబ్రవరి 08
మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన హీలియం బెలూన్ గత నెల రోజుల క్రితం ఏర్పాటు చేయగా , క్రమంగా బెలూన్ వాతావరణం కారణంగా కిందికి రావటం తో ఒక్కసారిగా పేలుడు సంభవించింది , ఈ క్రమంలో పశువుల కాపరి రాజు మరియు వి ఆర్ ఆర్ వెంచర్ లో పని చేసే నిరంజన్ , అంజిరెడ్డి , సుధాకర్ గౌడ్ లు నలుగురి మంటల్లో చిక్కుకున్నారు..ఈ పేలుడు కు నలుగురికి యాభై శాతం శరీరం కాలింది , గుట్టుచప్పుడు కాకుండా వి ఆర్ ఆర్ ఎండి రాజిరెడ్డి ప్రమాదానికి గురైన నలుగురిని సినిమా తరహాలో బయటకు పొక్కకుండా ఒకరిని కొంపల్లి హాస్పిటల్ మరోకరిని ఈ.సి.ఐ.ఎల్ లోని జీనియా , మరో ఇద్దరిని హర్ష హాస్పిటల్ లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు , ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినా ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై ఎటువంటి కేస్ నమోదు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.





