
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 8:
మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కొరకై సహకరించాలని “మీనా ఇంజనీరింగ్ కాలే జ్ విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి మురళీ యాదవ్ మాట్లాడుతూ.. నూతన జిల్లా ను మిర్యాలగూడలో ఏర్పాటు చేస్తే జిల్లా కార్యాలయాలు, మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాల, ఐఐటీ కళాశాల, మిర్యాలగూడ కు వస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో వీరితోపాటు మీనా కాలేజ్ ప్రిన్సిపల్, కళాశాల విద్యార్థినిలు , బీసీ సంక్షేమ సంఘ మహిళా మండల కార్యదర్శి బంటు కవిత,జిల్లా సాధన సమితి నాయకులు.. జ్వాలా,, నరసింహారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు





