
జనసముద్రం న్యూస్, సైబరాబాద్
(ఫిబ్రవరి 08)
సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్ లోని బాచుపల్లి పోలీసు స్టేషన్ కు చెందిన పోలీసు సిబ్బందిని ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను బుధవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించి రివార్డులు అందజేశారు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్ లోని బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గత ఆదివారం రాత్రి 7.30 గంటల సమయం లో గంజాయి విక్రయిస్తున్నా ముఠా ను అరెస్టు చేసి, విక్రయదారుడి నుంచి 41 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన బాలానగర్ డీసీపీ టి. శ్రీనివాస్ రావు, కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, బాచుపల్లి సీఐ నర్సిం హారెడ్డి, ఎస్ఎస్ఐ సాయినాధ్, కానిస్టేబుళ్లు రాజు, రాజేష్ కుమార్, కనకయ్య, హరిలాల్ లకు సీపీ అభినందించి రివార్డులు అందజేశారు






