
పాదచారులు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను
ప్రజల ఇబ్బందులను గ్రహించిన రాచకొండ సి పి డి ఎస్ చౌహన్ ఐపీఎస్
జన సముద్రం న్యూస్ ప్రతినిధి మల్కాజ్గిరి కుషాయిగూడ ఫిబ్రవరి 08
కుషాయిగూడ రాచకొండ సీపీ డి ఎస్ చౌహాన్, కుషాయిగూడ పోలిస్టేషన్ పరిధిలోని రాధికా చౌరస్తా, కుషాయిగూడ ఏరియాల్లో ట్రాఫిక్ జంక్షన్ ను, ట్రాఫిక్ జామ్ కి కారణమవుతున్న ఫుట్ పాత్ ఆక్రమణలను దగ్గరుండి పరిశీలించారు. సిగ్నల్స్ వద్ద ఫుట్ పాత్ ఆక్రమణల వల్ల పాదచారులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి అధికారుల కో-ఆర్డినేషన్ తో రాధిక, ఈసీఐఎల్ జంక్షన్ లను త్వరలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిసిపి అభిషేక్ మహంతి ఐ పి ఎస్., డిసిపి మల్కాజిగిరి జానకి ధరావత్ ఐ పి ఎస్., కుషాయిగూడ ఏసిపి, ట్రాఫిక్ ఏసీబీ , కుషాయిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ తదితరులు సీపీ వెంట ఉన్నారు.






