పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ అధికారులు మర్యాదగా వ్యవహరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి : ఎస్పీ కె.అపూర్వరావు..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 7 :

ఇండియన్ పోలీస్ సర్వీస్ లో తెలంగాణ రాష్ట్రం కు నూతనంగా నల్గొండ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారిగా బాధ్యత లు చేపట్టిన తదనాంతరం నల్గొండ జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరిని కలవడం జరిగింది.
మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను నల్గొండ జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు సందర్శించి పోలీస్ కార్యాలయంలోని నేరాల సంబంధిత రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ రేటు ను తగ్గించేందుకు 1టౌన్ పోలీసులు మరింత కృషి చేయాలని 1టౌన్ పరిధిలో జరుగుతున్న దొంగతనాలు ,ఇతర నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి నేరాలను అరికట్టాలని కోరారు. ఇదే విధంగా దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారికి సరియైన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని నల్లగొండ జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం జరిగేలా వన్ టౌన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని తెలిపారు. కేసు నమోదు చేసిన బాధితుల సూచన మేరకు కేసులను సమగ్రంగా విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా, నేరం చేసిన దోషులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇంతే కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘ ఉంటుందని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద గా వ్యవహరిoచి బాధితులకు తగు న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు పనిచేయాలని ఎస్పీ కె.అపూర్వరావు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు నేరుగా డీఎస్పీ , ఎస్పీ కార్యాలయం దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యేలా సంపూర్ణ సేవలందిస్తామని, కార్యాలయంలో ఉదయం 10: 30నిమిషాల నుండి 2 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏదైనా సమస్య వస్తే తనని సంప్రదించగలరని నల్గొండ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి కె.అపూర్వరావు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటగిరి, వన్ టౌన్ సీఐ రాఘవేంద్రరావు, ఎస్సై సుదీర్ కుమార్ టూ టౌన్ సిఐ సురేష్ కుమార్, రూరల్ సీఐ సత్యనారాయణ తదితరులను నల్గొండ జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు కలవడం జరిగింది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి