భూ బాధితులకు నష్ట పరిహారం లో నిర్లక్షం వహిస్తున్న రెవెన్యూ అధికారులు….

పరిశ్రమలకు వెళ్ళేదారిలో దర్నకి దిగిన 20 మంది రైతులు
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 8
భూములు కోల్పోయి ఎండ్లు గడుస్తున్న వారికి నష్ట పరిహారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్షం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివరాల ప్రకారం మనోహరాబాద్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామ శివారులో పరిశ్రమలు ఏర్పాటుకు 119 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతుల నుండి తీసుకున్నారు కొన్ని కారణాలవల్ల చెక్కులు గాని బాధితులు వాటికోసం రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగే అలసిపోయామని వారి బాధని వెళ్లబోచుకున్నారు ప్రభుత్వం నుండి ఇంకా చెక్కులు అందుకొని 19 మంది రైతులు పరిశ్రమకు వెళ్లే దారిలో బాయిటయించి ఆందోళనకు దిగారు వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి చెక్కులు ఇవ్వాలని లేని యెడల ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీవో కార్యాలయం కి తరలైవెళ్తమని తెలిపారు..ఈ దర్నలో రైతులకు అండగా ఉప సర్పంచ్ వెంకటేష్ యాదవ్ నూకల రాము నాగరాజు తదితరులు పాల్గొన్నారు..





